సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ పార్టీ కీలక సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 4 నుంచి 12 వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్ను పోటుకు రెండేళ్లు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తామని, జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజల వద్దకు కూటమి ప్రభుత్వ మోసాలను తీసుకొనివెళ్ళాలని మాజీమంత్రులు, అంబటి రాంబాబు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. భీమవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో వెన్ను పోటుకు రెండేళ్లు బ్రోచర్ ఆవిష్కరణ చేసారు. వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, భీమవరం పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు, ఇంటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు .
