సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పలు దేవాలయాలలో నేడు, మంగళవారం శ్రీహనుమజ్జయంతి వేడుకలను నిర్వహించారు. స్థానిక సుంకర పద్దయ్య వీధిలోని 25 అడుగుల శ్రీఅభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్వామివారిని దర్శించుకుని శ్రీహనుమజ్జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ హనుమాన్ జయంతి అందరి జీవితాల్లో ఆరోగ్యం,. సంతోషం, అనందం తీసుకురావాలన్నారు. హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.,మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్,గనిరెడ్డి త్రినాథ్, లంకి చిన్ని, ముచ్చకర్ల శివ, ముచ్చకర్ల సుబ్బారావు, బాలాజీ, కొండ్రు శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తదుపరి , ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాత బస్టాండ్ ఆవరణలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలలో పాల్గొన్నారు. ఈ వేడుకలను బస్సు ఓనర్స్, ఒంటెద్దు బళ్ల సంఘం, పాత బస్టాండ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తదుపరి మారుతీ టాకీస్ సెంటర్ లోని శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ రావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం, అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.
