సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో నేడు,బుధవారం ఉదయం వేదపండితులు అర్చకులు’ సుదర్శన హోమం’ ను వైభవముగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు, సత్యవాణి దంపతులచే ఆలయ ప్రధానార్చకులు పూజ కార్యక్రమాలను నిర్వహించి సుదర్శన హోమాన్ని ప్రారంభించారు. లోకానికి సంరక్షకుడైన విష్ణుమూర్తి చేతిలోని ఆయుధాలలో సుదర్శన చక్రం ఒకటి అని, సుదర్శన చక్రాన్ని కోటి సూర్యప్రభల శక్తిని కలిగి ఉన్న శక్తింతమైన ఆయుధంగా పేర్కొంటారని, దుష్ట శక్తులు గ్రహపీడలను నాశనం చేయడానికి సుదర్శన హోమం అత్యంత శక్తివంతమైనదని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రజలు క్షేమం కోసం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో సుదర్శన హోమం తలపెట్టడం గొప్ప విశేషమన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *