సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలను వేదికపైకి పిలవాలని టీడీపీ క్యాడర్ గట్టిగా అరవడంతో.. తోట సీతారామ లక్ష్మి టీడీపీ శ్రేణుల నుద్దేశించి .. ఇంత పెద్ద సభలో కూటమి నేతలు అందరిని పిలవడం కష్టమని టీడీపీ శ్రేణులు గౌరవంగా క్రమశిక్షణ పాటించాలని హితవు చెప్పారు. తదుపరి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, మాజీ ఎంపీ , టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి తోట సీతారామ లక్ష్మి,జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు తదితరులు మాట్లాడుతూ,,మోదీ 12 ఏళ్ల పాలన దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేలా చేసిందని,,రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలన ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఇచ్చినట్టే పాలన అందిస్తున్నామని, సూపర్ సిక్స్ తోపాటు మేనిఫెస్టోలో హామీల అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని సాధించామన్నారు. భీమవరం నియోజక వర్గంలో 1055 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ 9 కోట్ల 65 లక్షలు అందించామని, 32,496 మందికి తల్లికి వందనం ద్వారా రూ 44 కోట్ల 35 లక్షలు, ప్రతినెల 30,549 మంది లబ్ధిదారులకు రూ 316 కోట్లు పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. కొత్తవారికి పింఛన్లు అందించడమే లక్ష్యమన్నారు. భీమవరం నియోజక వర్గాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా పని చేద్దామని, అందరూ కలిసి కట్టుగా ఉండాలన్నారు. మనందరిది ముగ్గురు బలమని, ఒక్కరి బలం కాదన్నారు. ఈనెల 19న జిల్లాస్థాయిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమ సభ నిర్వహిస్తామని అన్నారు.
