సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుండి ప్రజా సమస్యల అర్జీలను భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి టిడిపి నాయకులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి, టిడిపి జిల్లా మాజీ అధ్యక్షుడు మెంటే పార్థసారథి మాట్లాడుతూ.. ఇటీవల నూతనంగా ఎన్నికైన టిడిపి జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులకు అభినందనలు తెలుపుతూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎంపిక టిడిపి చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని అన్నారు. పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎంపికైన టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు భీమవరం నియోజకవర్గం నుండి నియమితులైన జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులకు అభినందనలు తెలిపారు.నియోజకవర్గ ప్రజల సమస్యలు అధిష్టానం దృష్టికి తెచ్చి పరిషారం కోసం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని నియోజవర్గ ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
