సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో కొన్ని ప్రముఖ విద్య సంస్థలు వేసవి సెలవులు తరువాత స్కూల్స్ తెరుచుకోవడంతో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పీజులు వసూళ్లు చేస్తున్నాయని, పుస్తకాల విక్రయం చేస్తున్నాయని ,విద్య ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్నాయని SFI, ABVP , వంటి విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వాటిని నిరూపించడానికి ఇటీవల ప్రెవేటు , కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలను, నిర్వాహకులను నిలదీస్తూ వారిపై చర్యలకు జిల్లా విద్య శాఖ అధికారులకు పిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజగా..పెదమిరంలోని వెస్ట్ బెర్రీ విద్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ లోనే పాఠ్య పుస్తకాల విక్రయం నిర్వహిస్తున్నారని నిర్వాహకులు ఫై ఏబీవీపీ నేతలు మండిపడుతూ.. విద్య శాఖ కు పిర్యాదు చెయ్యడం వారు దానిపై చర్యలు కు ఉపక్రమించడం జరిగింది. అలాగే గునుపూడి లో నారాయణ స్కూల్ లో ఇంకా పూర్తీ స్థాయిలో భవన నిర్మాణం పూర్తీ కాకమునుపే ఎడ్మిషన్స్ నిర్వహిస్తూ తరగతుల నిర్వహణకు, పాఠ్య పుస్తకాల అమ్మకాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎవరైనా విద్యార్థికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకొంటారని ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నేతలు ప్రశ్నించి వారిపై చర్యలకు విద్యాశాఖ కు పిర్యాదు చెయ్యడం జరిగింది. ఇదే రీతిన భీమవరం కొత్త బ్రాంచి లు ఓపెన్ చేస్తున్న కొన్ని ప్రముఖ విద్య సంస్థలపై కూడా పిర్యాదులు వస్తున్నాయి.
