సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంపట్టణంలోని ఆర్యవైశ్య వర్తకసంఘం (త్యాగరాజ భవనం) కు తాజగా నూతన కమిటీ ఏర్పడింది. అధ్యక్షులుగా వబిలి శెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు తటవర్తి బదరీ నారాయణలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా నూతన కమిటీని అభినందించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ… జిల్లా కేంద్రం మన భీమవరం పట్టణం ఆర్ధిక ప్రగతి లో ఆర్య వైస్యులు తమ వ్యాపారాలతో కీలక భూమిక పోషిస్తున్నారని.. ఇప్పుడు కొత్త ఉత్సహంతో ఏర్పాటయిన నూతన కమిటీ సంఘ బలోపేతానికి కృషిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏవీఎస్ సభాపతి, పరుచూరి నాగేశ్వరరావు, తటవర్తి కృష్ణ ప్రసాద్, బొండా రాము తదితరులు పాల్గొన్నారు.
