సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం రెండవ పట్టణంలో శ్రీ రాంపురంలోని మహిమానిత్వ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ( సుబ్బారాయుడు షష్ఠి గుడి) ఆలయ పునర్నిర్మాణం నిర్మాణానికి ఇటీవల రూ1కోటి 50 లక్షల నిధులను మంజూరు చేసిన సీఎం జగన్ కి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ గుడి నిర్మాణం కోసం స్థానిక గన్నాబత్తుల వారి కుటుంబం, కాకులపాటి వారి కుటుంబం కలిసి ఈ ఆలయ నిర్మాణానికి రూ 10 లక్షల విరాళాన్ని గత సోమవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీ రామలింగేశ్వర స్వామి (సుబ్బారాయుడి గుడి) ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని, విరాళాలను ఇచ్చిన ఈ రెండు కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. అంతేకాకుండా వన్ టౌన్ లో ఎడ్వార్డ్ ట్యాంక్ వద్ద పురాతన దేవాలయం శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి ఆలయ పునరనిర్మాణ పనులు ప్రభుత్వ, దాతల సహకారంతో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. (ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే .. గ్రంధి,కుటుంబం 10 లక్షల విరాళం ఇవ్వడం గమనార్హం)
