సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి ప్రాంతంలో గల రైతు బజార్ సెంటర్లో బ్రాందీ షాపు వద్ద మందుబాబు బహిరంగంగా మందు కొడుతూ అటుగా వచ్చేవారిని. వెళ్లే ప్రజలను నాచువర్ సెంటర్ లోకి వెళ్లే పాదచారులను ఇబ్బంది పెడుతున్నారని ఆ ప్రదేశం అంతా ఉదయం 9 గంటల నుండి రాత్రి పది గంటల వరకు తాగి న్యూసెన్స్ చేస్తున్నారని పలువురు స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు గత మంగళవారం రాత్రి వన్ టౌన్ సీఐ నాగరాజు పోలీస్ బాలగంతో ఆ ప్రాంతానికి అకస్మాత్తు గా వచ్చి అక్కడ ఉన్న మందుబాబులని గుర్తించి ఇకపై ఇక్కడ మద్యం సేవిస్తూ కనిపిస్తే. వదిలిపెట్టే సమస్య లేదని, తాటతీస్తాం అని వారికీ హెచ్చరిక ఇచ్చారు. అలాగే గత రాత్రి రైతు బజార్ ప్రాంగణమంతా పరిశీలించారు. రోడ్లపై మోటార్ సైకిల్ పెట్టిన వారికి ఫైన్ విధించారు. ఆ చుట్టుపక్క ప్రాంతమంతా వీధి దీపాలు లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ అధికారులకు ఫోన్ ద్వారా వీధిలైట్లు వెలిగేలా చూడాలని, అరాచక శక్తులకు కూడలి కాకుండా ఆ ప్రాంత ఫుల్ లైటింగ్ ఉండాలని కోరారు. అలాగే రైతు బజార్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మొత్తం పర్యవేక్షిస్తామని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ ను కూడా సంప్రదించి ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల గురించి తెలుసుకుంటామని తెలిపారు. వన్ టౌన్ సీఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. రైతు బజార్ ప్రాంగణంలోనే కాదు పట్టణంలో ఎక్కడైనా ప్రత్యేకించి మందుబాబులకి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే తాటతీస్తాం అని తాగి న్యూసెన్స్ చేస్తే జైలు పాలవుతారని హెచ్చరించారు.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని లేక పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసినా సరే 2 నిమిషాల్లో మా సిబ్బంది వచ్చి అక్కడ సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *