సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:మృత్ భారత్ పథకం లో భాగంగా నేడు, ఆదివారం ఉదయం భీమవరం రైల్వే టౌన్ స్టేషన్ అభివృద్ధి కి 22.13 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల కు పర్చూల్ పద్దతిలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసినవేళ నేడు, టౌన్ రైల్వే స్టేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామా కృష్ణంరాజు తనయుడు భరత్’ మరియు టీడీపీకి చెందిన ఉండీ ఎమ్మెల్యే రామరాజు, మరియు మాజీ ఎమ్మెల్యే కే శివరామరాజు తో వేదికపై అస్సినులయ్యారు, ఈసందర్భంగా మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకం ఆవిష్కరించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన పిల్లలకు బహుమతులు అందజేశారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టౌన్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ తోపాటు ప్రయాణీకుల భద్రత కోసం అధిక ప్రాధాన్యత కు కేంద్రం నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *