సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డీ.ఎన్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగముకు చెందిన రాపాక సురేష్ బాబుకు ప్రతిష్ఠాత్మక అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ (Ph.D.) పట్టా పొందారు. ఆయన సమర్పించిన పీహెచ్‌డీ పరిశోధనా సిద్ధాంతం పరిశోధనలో బయోమెటీరియల్ ద్వారా స్థిరీకరించబడిన ట్రాన్సిషన్ మెటల్స్ డోప్డ్ ZnSe, CdSe క్వాంటమ్ డాట్స్, అలాగే వాటి గ్రాఫీన్ ఆక్సైడ్ (Graphene Oxide) కాంపోజిట్స్‌ను సంశ్లేషణ చేసి, వాటి భౌతిక, రసాయన లక్షణాలను విశ్లేషించారు. నేడు, శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో డీ.ఎన్.ఆర్. అసోసియేషన్ సెక్రటరీ & కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), తో పాటు అధ్యాపక సిబ్బంది మాట్లాడుతూ.. వారి పరిశోధనాత్మక కృషిని ప్రశంసిస్తూ, ఉన్నత విద్యా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేపట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *