సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గ పరిధిలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 77,66,838/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను 74 మంది లబ్ధిదారులకు నేడు, శుక్రవారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ఎంతో భరోసానిస్తోందని, ఖరీదైన వైద్యాన్ని భరించలేని వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న సాయం అండగా నిలుస్తోందని, లబ్ధిదారులందరూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని రఘురామా అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు కూటమి నేతలు పాల్గొనారు
