సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గలోని పేద ప్రజలు అనారోగ్యంతో చేయించుకున్న శస్త్ర చికిత్సలకు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేశారని భీమవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో 51 మందికి 33 లక్షల రూపాయల సి.ఏం.ఆర్.ఎఫ్ చెక్కులను తోట సీతారామలక్ష్మి టీడీపీ నాయకులతో కలిసి లబ్దిదారులకు ,దరఖాస్తుదారులకు అందించారు.ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ నేతలు.. పేదలందరికీ తోట సీతారామలక్ష్మి సిఫారసుతో త్వరితిగతిన ఆర్థిక సహాయం మంజూరు చేయించడం అభినందనీయమన్నారునాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
