సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం వైభవంగా ప్రారంభమయ్యింది. నేటి ఉదయం శ్రీ రమసహిత సత్యనారాయణ స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో కొండ దిగువన తొలి పావంచాల వద్దకు తీసుకొచ్చారు. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. ఆపై వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత గిరిప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. గిరిప్రదక్షిణకు దాదాపు 1.50 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సత్యదేవుని నామస్మరణతో సత్యగిరిలు మార్మోగాయి.దాదాపు 8.2 కిలోమీటర్ల మేర ఈ గిరిప్రదక్షిణ సాగుతుంది. . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిప్రదక్షిణ జరిగే ప్రాంతంలో పలుచోట్ల తాగునీటి కేంద్రాలతో పాటు అల్పాహారం, ఆహార పంపిణీ స్టాళ్లను , ప్రత్యేక వైద్య శిబిరాల ను ఏర్పాటు చేశారు.
