సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి తో తీవ్ర వివాదాలు నేపథ్యంలో ఎట్టకేలకు ఫైర్ బ్రాండ్ కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తూ ఢిల్లీ లోని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో మంత్రి పదవికి గౌరవప్రదంగా రాజీనామా చెయ్యడానికి కొండా సురేఖ అంగీకరించకపోవడంతో గవర్నర్ ఉండే లోక్‌భవన్‌కు సీఎంవో లేఖ పంపించింది. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *