సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ అమెరికా యుద్ధం మరల ప్రారంభం కావడంతో గత బుధవారం భారీ నష్టాలను చవిచూసిన భారత్ లోని దేశీయ సూచీలు నేడు, గురువారం మరల లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు మొగ్గుచూపడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.55గా ఉంది. గత సెషన్ ముగింపు (76,503)తో పోల్చుకుంటే నేడు గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీగా పుంజుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 548 పాయింట్ల లాభంతో 77,052 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ ప్రస్తుతం 172 పాయింట్ల లాభంతో 24,054 వద్ద కదలాడుతోంది (stock market ).అయితే ఇన్ఫోసిస్, నాల్కో, పాలీక్యాబ్, సోలార్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 719 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది.
