సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షించడానికి సీఎం చంద్రబాబు ఈ నెల 13న పోల వరం రానున్నారు. ఈ మేరకు జలవనరులశాఖ నుంచి ఏర్పాట్లు చేయాల్సిందీగా ఏలూరు కలెక్టరేట్ అధికారులకు తాజాగా సమాచారం అందింది. సీఎం పర్యటించనున్న ఈసీఆర్‌ఎఫ్ డ్యాం, పవర్ హౌస్, యూనిట్ టర్బైన్ల నిర్మాణ ప్రాంతాలను, హెలీప్యాడ్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పోలవరంతో పాటు పట్టిసీమలో గోదావరి పుష్కర స్నాన ఘట్టాల ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు సూచించారు.
