సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం ధరలు రోజుకోరకంగా దోబుతూచులాడుతున్నాయి. భారత్‌లో నిన్న 10 గ్రాములకు సుమారు రూ.2 వేల మేర పెరిగిన ధరలు నేడు మంగళవారం మరల తగ్గాయి. నేటి మంగళవారం (జూన్ 23) ఉదయం 11 గంటల సమయంలో విజయవాడ హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,910గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర రూ.2,070ల మేర పతనమైంది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,900 మేర తగ్గి రూ.1,33,750కు పడిపోయింది. 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,09,440గా ఉంది. ఏది ఏమైనా గతం తో పోల్చుకొంటే భారీగా ధరలు తగ్గాయన్నది వాస్తవం.. అయిన జ్యువెలరీ షాప్ లలో కొనుగోళ్లు వేగంగా లేకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *