సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలోని రంగం పేట మండల పరిధిలో వడిశలేరు-రంగం పేట మధ్య నేడు, మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం పిఠాపురం మండలం లోని మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది కార్మికులు బ్రతుకుతెరువుకు.. బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. భవన నిర్మాణ పనులు ముగించుకుని తిరిగి తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్న కార్మి కులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
