సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ పరిధిలో నేడు, మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈనెల పేదల పింఛను పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఏపీలో పింఛన్ పంపిణి కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా వేదికపై నుండి ప్రజలనుద్దేశించి మాట్లాడుతు... రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యం అని ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు సహా అన్ని వర్గాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది అని అన్నారు.. దివంగత ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా వృద్ధాప్య పింఛనును రూ.4,000కు పెంచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అని అదేవిధంగా దివ్యాంగుల పింఛనును ఒకేసారి రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచి వారికి మరింత భరోసా కల్పించాలన్నారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కారిస్తున్నామని యూనిట్ విద్యుత్‌ను రూ.1.50 సబ్సిడీ ధరకు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు నాన్-ఆక్వా జోన్ అనే నిబంధనతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కూడా విద్యుత్ కనెక్షన్లు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అన్నారు. నరసాపురం బైపాస్‌కు టెండర్లు.. త్వరలోనే 216వ జాతీయ రహదారి పనుల ప్రారంభిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు, నరసాపురం ఎమ్మెల్యే నాయక్ వేదికపై అస్సినులు అయ్యారు.
