సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. భీమవరం పట్టణంలో ఈనెల 14న జరిగిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జన్మదినం వేడుకలు నేపథ్యంలో తాడేరుతో పాటు పలు చోట్ల ఆయనపై అభిమానంతో రక్త దానం చేసిన పలువురు అభిమానులకు నేడు, మంగళవారం స్వయంగా శాలువాలు కప్పి ఘన సన్మానం చేసి వారి సేవలకు సర్టిఫికెట్ అందజేసారు. ఈ కార్యక్రమంలో గ్రంధి రవితేజ, తోట బోగయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై ఇంతటి అభిమానం చూపిన అభిమానులు శ్రేయోభిలాషులుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, రక్త దానం చెయ్యడమంటే ప్రాణపాయంలో ఉన్న వారికీ ప్రాణం పొయ్యడమేనని తన మీద అభిమానంతో ప్రజల కోసం ఇంత మంచి కార్యక్రమం చేసిన వీరిని చూసి గర్వపడుతున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *