సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. భీమవరం డి మార్ట్ పక్కన అయ్యప్ప స్వామి సేవా సమితి 4వ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత స్వాముల బిక్షా కార్యక్రమాన్ని నేడు, మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు స్వయంగా భవానీలకి , అయ్యప్ప స్వాములకు భోజన వడ్డన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. అన్నదాన పుణ్య కార్యక్రమంలోనూ అందరూ భాగస్వాములైతే ఎంతో పుణ్య ఫలమని 48 రోజులపాటు అయ్యప్ప, భవానీ, శివ, సాయి, ఆంజనేయు స్వాములకు ఉచితంగా భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా ఇటువంటి మహోత్తర కార్యక్రమం నిర్వహించడం భగవత్ సేవతో సమానమన్నారు. అయ్యప్ప స్వామి సమితి సభ్యులు మాట్లాడుతూ.. దసరా మొదలుకొని 48 రోజులపాటు డిసెంబర్ 9వ తేదీ వరకు దాతల సహకారంతో అయ్యప్ప, భవానీ, శివ, సాయి, ఆంజనేయు స్వాములకు ఉచితంగా భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
