సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా, నేడు, సోమవారం ఉండి నియోజకవర్గంలోని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సమక్షంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా భీమవరం శివారు పెదమిరం లోని ఆయన కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు చిత్రంతో రూపొందించిన భారీ కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఉండి లోని స్థానిక అన్న క్యాంటీన్లో స్థానిక నాయకులతో కలిసి రఘురామకృష్ణ రాజు ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఇంకా నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సంక్షేమ కార్యక్రమాలకు హాజరు అయ్యారు
