సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు ను జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు మరియు , తోట సీతారామ లక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కోసి ఘనంగా నిర్వహించారు. మంతెన రామరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక వ్యక్తి కాదని సామూహిక శక్తి అని చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్ర బాబు జన్మదినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద కేక్ కటింగ్ చేసినా అనంతరం ప్రజలతో కలిసి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మాజీ అధ్యక్షుడు మెంటే పార్థసారథి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మేరగాని నారాయణమ్మ టిడిపి కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.
