సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ జనతా పార్టీ జాతీయ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani) నేడు, శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య భారంతో 98 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన ఇటీవల ఛాతీలో ఇన్ఫెక్షన్, సమస్యలతో బాధపడుతుండటంతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన భారత రత్న అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా అభిమానులు, రాజకీయ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 లోక్ సభ స్థానాల గెలుపు తో ప్రారంభం అయిన బీజేపీ ప్రస్థానం అద్వానీ అయోధ్య రామ మందిర రద యాత్రతో ఒక్కసారిగా 80 కి పైగా లోక్ సభ స్థానాల గెలుపు కు గ్రాఫ్ పెరిగి తదుపరి బీజేపీ కేంద్రం లో అధికారంలోకి రావడానికి బాటలు వేసిన యుగపురుషుడు గ అద్వానీని చరిత్ర గుర్తుంచుకొంటుంది.
