సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నామినేషన్స్ వెయ్యకుండా అడ్డుకొన్న తీరు ,వైసీపీ ఎంపీ మిధున రెడ్డి ఫై రాళ్ల దాడి ,వైసీపీ నేతల కార్లు, కార్యాలయాలు ద్వంసం, ప్యాక్షన్ సినిమా తలపించేలా వరుస బెట్టి కార్లు తగలబెట్టేయడం.. పైగా నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న అభ్యర్థులనే పోలీస్ లు అదుపులోకి తీసుకొన్నారని ఆరోపణలు ? వంటి దుశ్చర్యలు అరాచకం ‘బీహార్’ ను తలపించే ఘర్షణలపై ‘నేషనల్ మీడియా’లో, సోషల్ మీడియా వార్తలు, వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీనితో నేడు శనివారం విజయవాడలో పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ‘అనిల్ చంద్ర పునేఠా’ సీరియస్ అయ్యారు. పోలిసుల పని తీరుపై ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా రాయచోటి, పుంగనూరులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమను కొన్నిరాజకీయ పార్టీల నేతలు కలిశారని.. ఆయా సమస్యలపై ఆయా జిల్లా ఎస్పీలతో తాము మాట్లాడామని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చాలా సీరియస్ పరిస్థితి ఉందని.. అల్లర్లు జరగకుండా చూడాలని ఎక్కడైనా ఘర్షణలు జరిగితే అదనపు బలగాల సహకారంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. అర్హత ఉన్నా అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్లక్ష్యంగా కనిపిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
