సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున 150 ఏళ్ళు పైగా చరిత్ర ఉన్న మహిమానిత శ్రీశ్రీశ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానం. ఇండియన్ బ్యాంక్ పక్కన. ( సిగ్మా ఆన్ లైన్ న్యూస్ కార్యాలయం దగ్గర) దసరా వేడుకలలో భాగంగా . ది. 19/10/1026 వ తేదీ సోమవారం మహర్నవమి రోజు శ్రీ వీరభద్ర సంబరం నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 6 గం. నందాద్వీపం రాత్రి శతాబ్ది పైగా సంప్రదాయంగా వస్తున్న నిప్పుల గుండం రాత్రి 8 గంటలకు ఉపవాసం ఉన్న భక్తులు తొక్కుట జరుగును. రాత్రి ఆలయ ఆవరణలో రాత్రి 9 గం. శులాల సంబరం నిర్వహిస్తారు. కావున తమ కోరిన మొక్కుల కోసం పవిత్ర స్నానాలు చేసి నిప్పుల గుండం త్రొక్కే భక్తులు ముందుగానే దేవాలయం వద్దకు వచ్చి వివరాలు తెలుసుకోవలసినది.
