సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. సిట్ ఎన్ని సార్లు విచారణకు పిలిచిన హాజరుకాకపోవడంతో గత సోమవారం రాత్రిరాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)ని హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు వెంటనే విజయవాడ తరలించారు. విజయవాడ సీపీ కార్యాలయంలో నేడు, మంగళవారం తెల్లవారు జాము 3గంటల నుండి విచారిస్తున్నారు. కొద్దీ విరామం తరువాత నేటి ఉదయం 8 గంటల నుండి మరో ధపా విచారణ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు తమ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *