సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Sensex, Nifty) నేడు శుక్రవారం మరింత జోరును ప్రదర్శించాయి. ఇరాన్ అమెరికా యుద్ధం తీవ్రత మరల తగ్గటం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ (IT), బ్యాంకింగ్ షేర్ల రంగ షేర్లలో కనిపించిన భారీ కొనుగోళ్ల అండతో నేడు ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా లాభాలను పక్కా చేసుకున్నాయి. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 244.10 పాయింట్లు(1.02 శాతం)పెరిగి 24,206.90 వద్ద ముగియగా, సెన్సెక్స్ 827.57 పాయింట్లు(1.08 శాతం) పెరిగి 77,569.39 వద్ద స్థిరపడింది. మొన్న బుధవారం నాటి తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి తర్వాత భారీగా పడిపోయిన మార్కెట్, గడచిన రెండు రోజులలో మార్కెట్ క్యాప్‌లో రూ.10 లక్షల కోట్ల అద్భుతమైన రికవరీ సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *