సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కినేని నాగార్జున వారసునిగా సినిమాలలో ఆటుపోట్లు ఎదుర్కొని 3 ఏళ్ళు తరువాత ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ బోడో కలసి నటించిన ‘ ‘లెనిన్‘ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్‌ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్’ను అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మరి సినిమా కధ ఎలా ఉందో తెలుసు కుందామా…ఇది రాయలసీమ నేపథ్యంలో చంద్రగిరి నియోజక వర్గం శ్రీరామపురంలో దాదాపు పాతికేళ్ళ క్రితం జరిగిన కథ. ఆ గ్రామంలో భారతం మిట్ట పేరుతో ప్రతి యేడాది ద్రౌపది ఉత్సవాలను ఘనంగా చేస్తారు. ఆ సమయంలో ఊరిలో ఎవరి ఒంటి నుంచి చుక్క నెత్తురు నేల మీద పడకూడదనేది ఆచారం. అక్కడ పెద్దరికం అంతా నాదముని భార్య జయంతి (ఈశ్వరీరావు) దే. అనాథగా ఆ ఊరిలోకి అడుగు పెట్టిన లెనిన్ (అఖిల్ అక్కినేని) ను ఆమె చేరదీసి, తన కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో పాటే పెంచి పెద్ద చేస్తుంది. లెనిన్ కు యువకుడు అయ్యాక మావ వరస అయ్యే నీలకంఠం (రాంకీ) రెండో కూతురు భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో అయినా వాళ్ళ నుంచి, ఇది నా గ్రామం అనుకున్న లెనిన్ కు అక్కడ ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? అనేది మహా భారతాన్ని తలపించే మిగతా కథ . ఇక సినిమాలో ఇందులో పాజిటివ్‌ క్యారెక్టర్స్ కంటే నెగెటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ. ప్రతి పాత్రకు ఓ బలమైన నేపథ్యాన్ని రాసుకోవడంలో దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు సక్సెస్ అయ్యాడు. ఊహించని మలుపులతో కథను క్లయిమాక్స్ వరకూ తీసుకెళ్ళిన దర్శకుడు హీరోకి ఉన్న ఓ బలహీనతను రివీల్‌ చేసి ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తాడు. హీరోగా అఖిల్ వన్ మాన్ షో గా మంచి నటన ప్రదర్శించాడు. భాగ్యశ్రీ బోర్సే తన అందచందాలతో నటనతో అదరగొట్టింది.. శివాజీ, బ్రహ్మాజీ, సునీల్‌, శత్రు, రాంకీ, వడ్లమాని సాయి శ్రీనివాస్‌, గెటప్ శ్రీను, పాత్రలలో జీవించారు.అయితే..చివరలో హ్యాపీ ఎండింగ్‌ కాకపోవడంతో ప్రేక్షకులు భారంగానే థియేటర్ నుంచి బయటకు వస్తారు. తమన్ స్వరపర్చిన పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమా చాల రిచ్ గా నిర్మించారు.అయితే ఈ సినిమాకు ‘లెనిన్’ అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *