సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, నేడు శనివారం మధ్యాహ్నం సమయంలో వాయుగుండంగా మారి నేటి రాత్రి కి ట్రింకోమలీ, జాఫ్నా మధ్య ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రాయలసీమలో నేడు, శని, రేపటి ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏపీలో గాలులు తీవ్రత , చలి గాలులు ఇప్పటికే పెరిగిపోయాయి. తీర ప్రాంతాల్లో అధిక గాలులు వీస్తున్నాయి. ఏపీలో రైతాంగం జాగ్రత్తలు వహించాలి అని అంటున్నారు. ధాన్యం పొలాల్లో ఉంటే భద్ర పరుచుకోవాలని అంటున్నారు. వాయుగుండం ప్రభావంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉంటుందని జనవరి నెలలో వాయుగుండం, తుఫాన్లు అంతా బలమైనవి కాదంటూ విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
