సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సరైన సూపర్ హిట్ పడాలె కానీ విజయ్ దేవరకొండను ఎవరు ఆపలేరు. VDxShouryuv: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో జంతువులు, ఆయుధాలు కనిపించడం వల్ల ఇది ఒక ఇంటెన్స్ స్టోరీ ఉండే సినిమా అని అర్థమవుతోంది. ముఖ్యంగా “ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే” అనే మాట కథలో ప్రధాన భావం ఏమిటో చెబుతోంది. విజయ్ తన గ్యాంగ్‌తో కలిసి ఆయుధాలు పట్టుకుని నడుస్తున్న సన్నివేశం చూస్తే ఇది ఒక పిరియాడికల్ యాక్షన్ డ్రామా అని భావించవచ్చు.. విజయ్ ప్రస్తుతం బాహుబలి తరహాలో స్టిల్స్ మీడియాకు వదులుతున్న‘రణబాలి’ రాయలసీమ పాత కాలం నేపథ్యంతో రూపొందుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఇప్పటికే పాటలు వీడియో బాగా వైరల్ అయ్యాయి. ఇక చాల క్రితం ప్రారంభించిన 'రౌడీ జనార్దన‘గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథ ఇది. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. షూటింగ్ పూర్తీ అయ్యింది. త్వరలో రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *