సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి తెలుగు సినిమా కు ఇండస్ట్రీ సూపర్ హిట్స్ అందిస్తున్న సీనియర్ అగ్ర హీరో వెంకటేశ్‌ ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం- హౌస్‌ నెం 47’ శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. సినిమా అక్టోబరు 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిన్న ఆదివారం రాత్రి నిర్వహించిన వేడుకలో ఈ చిత్రం నుంచి తమన్‌ సంగీతం లో ‘నారాయణమ్మ’ అంటూ సాగే మాస్ పాటను విడుదల చేశారు. ఈ సందర్భముగా భీమవరం బ్రాండ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా మారిన తరువాత సుదీర్ఘ కాలం తరువాత నా అభిమాన హీరో వెంకటేష్ తో సినిమా చేసానని.. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ‘పవిత్రబంధం’ చిత్రం కోసం మొదటి డైలాగ్‌ రాశానని, పెళ్లి చేసుకొందాం కూడా పనిచేశానని అన్నారు, ఏది ఏమైనా వెంకటేష్ అంటే మిగతా హీరోల లాగా ఇప్పటికి చనువు తీసుకోలేనని అది బహుశా మొదట దూరం నుండి చూడటం వల్ల గౌరవం వల్ల వచ్చిన భక్తి అయ్యి ఉంటుంది.అని ఛలోక్తి విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *