సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీకి ఊహించని భారీ షాక్ ఇచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కే .. నేడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంచలనం రేపారు. శాసనసభా కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆళ్ల పేర్కొన్నారు. మంగళగిరి లో 2 పర్యాయాలు వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆర్కే, గత పర్యాయం సీఎంగా ఉన్న చంద్రబాబు కుమారుడు లోకేష్ ను ఓడించి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షించారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడలేని విధంగా ఆ ఎన్నికలలో టీడీపీ డబ్బు వరదలా పారించిన సరే, ఆళ్ల కృష్ణారెడ్డి విజయం ఆపలేకపోయిందని , ఆయనకు జగన్ గ్యారంటిరి గా మంత్రి పదవి ఇస్తారని అపట్లో ప్రచారం జరిగింది. అంతే కాదు వైసిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు ను కోర్ట్ కేసులలో ముప్పు తిప్పలు పెట్టిన సమర్ధవంతమైన వైసీపీ నేతగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఖ్యాతి గాంచారు. అయితే మంగళగిరి నియోజకవర్గానికి సీఎం జగన్ నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారని, అంతే కాదు.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు, అతనిని సీఎం జగన్ మందలించకుండా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి భావిస్తున్నారు అని సమాచారం. ఏది ఏమైనా ఆయన అధికారికంగా రాజీనామా కారణాలు ప్రకటించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *