సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: యువత సాధికారత, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘రోజ్ గార్ మేళా‘ విజయవంతంగా కొనసాగుతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన 19 రోజ్ గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేడు,శనివారం మధురైలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని 88 మంది యువతీ యువకులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. నేడు ,దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలను అందజెయ్యడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *