సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నో ట్విస్ట్ ల మీద ట్వీస్ట్ లు దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్‌ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. ఎవరు ఊహించని రీతిలో సీఎం విజయ్ నిన్న మాజీ సీఎం స్టాలిన్ నివాసం కు వెళ్లి తన రాజకీయ చతురతను మొదటి ఎత్తుతో ప్రారంభించారు. ఒక్క సీటుకే పరిమితం అయిన బీజేపీ చెప్పినట్లు మనం వినడం దేనికని? అన్నాడీఎంకే (AIADMK)లో జరుగుతున్నా తిరుగుబాటు నేడు, మంగళవారం బయటకు తన్నుకు వచ్చింది. తాజాగా ఆ పార్టీలోని సీవీ షణ్ముగం (CV Shanmugam) వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్‌ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK)కు మద్దతు ప్రకటించింది. ఆయన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 53 ఏళ్లుగా నువ్వా నేనా పోరాడిన డీఎంకేతో చేతులు కలపాలని అన్నాడీఎంకే అనుకుందని, అందుకే పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోయామని మీడియాతో షణ్ముగం తెలిపారు.తాము ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. తమిళనాడులో వరుస ఓటములకు బీజేపీ తో జత కట్టిన పళనిస్వామే కారణమని విమర్శించారు. పార్టీలో చీలిక లేదని పళనిస్వామి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసారు.విజయ్ అసెంబ్లీ లో తన బలనిరూపణకు ఒక్కసారిగా కావలసిన బలం కన్నా 30 మంది ఎమ్మెల్యేలు అధికంగా సాధించడం తో రాజకీయంగా కీలక విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *