సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి మండల దీక్షధారణ కార్యక్రమం నేడు, సోమవారం ఉదయం దేవాలయ ఆవరణలో భారీ పందిళ్ళ క్రింద.. ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ కార్యక్రమం నిర్వహించి 41 రోజులకుగాను 160 మంది భక్తులుకు శ్రీ అమ్మవారి మాలలు ధరింప చేసారని ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. త్వరలో అర్ధమండల దీక్ష మాల ధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆసక్తి ఉన్న భక్తులు దేవాలయం వద్ద EO కార్యాలయం లో సంప్రదించాలి.
