భీమవరం పురపాలక సంఘ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముందస్తు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి గారి ఆదేశాల మేరకు, భీమవరం పురపాలక సంఘ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర రెడ్డి గారు తెలియజేయునది ఏమనగా — పురపాలక సంఘ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో అనధికారికంగా జంతువులను వధించడాన్ని పూర్తిగా నిషేధించడమైనది.ముఖ్యంగా గోవులు, దూడలు, గర్భంతో ఉన్న పశువులు మరియు అనారోగ్యంతో ఉన్న ఇతర జంతువులను వధించడం చట్టరీత్యా నేరమని తెలియజేయడమైనది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా అనధికారికంగా జంతువధకు పాల్పడినట్లు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రజల నుండి ఫిర్యాదులు అందినట్లయితే, అట్టి వారిపై “జంతు హింస నిరోధక చట్టం – 1960”లోని సెక్షన్ 11 ప్రకారం అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించబడునని హెచ్చరించడమైనది.అలాగే, ఎక్కడా బహిరంగ మరియు అనధికారిక జంతువధ జరగకుండా పర్యవేక్షణ నిమిత్తం మరియు చట్టం అమలు చేయుటకు క్రింది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడమైనది.బృంద సభ్యులు:శ్రీ ఎ. రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ – టీమ్ లీడర్డా. ఆర్. కోటిలింగరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిడా. జయకర్ జాక్సన్, సహాయ సంచాలకులుడా. హుస్సేన్, ఉప సంచాలకులు, భీమవరంశ్రీ ఆర్. రాంబాబు, తహసీల్దార్, భీమవరంశ్రీ వెంకటరావు, ఆర్‌ఐశ్రీ ఎ. రమేష్, సీఐ, 1 టౌన్శ్రీ క్రిష్ణా జీ, ఎస్ఐ, 1 టౌన్శ్రీ ఆర్. సోమశేఖరం, ఎంహెచ్‌ఓ ఇన్‌చార్జ్అందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లుఈ సమాచారాన్ని ముందస్తుగానే పురపాలక సంఘ పరిధిలోని అన్ని మసీదుల నిర్వాహకులకు, ముస్లిం మత పెద్దలకు మరియు కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగిందని, అందువల్ల ఎక్కడా ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు చోటుచేసుకోకుండా, పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ పురపాలక సంఘ యంత్రాంగానికి ముస్లిం సోదర సోదరీమణులందరూ సహకరించవలసిందిగా కమిషనర్ గారు విజ్ఞప్తి చేయడమైనది.
