– మహానాడు వేడుకలను ప్రారంభించిన తోట సీతారామలక్ష్మి — ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న హైబ్రిడ్ వర్చువల్ మహానాడు క్లస్టర్ సమావేశాలలో భాగంగా భీమవరం నియోజవర్గం 8వ క్లస్టర్ సమావేశాన్ని మాజీ ఎంపీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోట సీతారామలక్ష్మీ ప్రారంభించి పట్టణంలోని 3 క్లస్టర్ సాహితీ ఫంక్షన్ హాల్, 4 క్లస్టర్ చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్, 5 వ ఆదిలక్ష్మి రజక కమ్యూనిటీ హాల్, 6వ క్లస్టర్ శ్రీకృష్ణదేవరాయ ఫంక్షన్ హాల్ ఏడో క్లస్టర్ ప్రొనౌన్స్ ఫంక్షన్ హాల్ ఎన్నో క్లాస్టర్ ఎన్సి కళ్యాణ మండపం,9 క్లస్టర్ కొవ్వాడ అన్నవరం లో నిర్వహించిన క్లస్టర్ మహానాడు సమావేశాలలో హాజరయ్యారు. ముందుగా టిడిపి జెండా ఆవిష్కరించి టిడిపి వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన అనంతరం తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ నా తెలుగుదేశం నా బాధ్యత నినాదంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టిడిపి నాయకులకు అందించి నూతన వరవడులతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వర్చువల్ క్లస్టర్ సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారని మరి ఇటువంటి వ్యవస్థ మరే ఇతర రాజకీయ పార్టీలకు లేదన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ సమన్వయ అధ్యక్షులు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని భీమవరం నియోజకవర్గంలో మొత్తం 11 క్లస్టర్ల సమావేశాలను వీరవాసరం మండలంలో 1,2 క్లస్టర్స్, భీమవరం మండలంలో 9,10,11 మూడు క్లస్టర్లు, భీమవరం పట్టణంలో 3,4,5,6,7,8 ఆరు క్లస్టర్ల సమావేశాలలో టిడిపి సీనియర్ నాయకులు, క్లస్టర్లు, యూనిట్లు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీల నాయకులు పాల్గొని టిడిపి అధిష్టాన ప్రసంగాలను వీక్షిస్తూ వర్చువల్ ద్వారా సమావేశమై మహానాడు వేడుకలుగా వేడుకలలో పాల్గొంటున్నారన్నారు. స్థానిక పట్టణ హన్సి కళ్యాణమండపంలో నిర్వహించిన 8 వ క్లస్టర్ సమావేశంలో టిడిపి అధిష్టానం ముద్రించిన మహానాడు 2026 పుస్తకాన్ని ఆవిష్కరించి క్లస్టర్ కన్వీనర్ కొత్తూరు బాపిరాజు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులను సన్మానించారు. నియోజకవర్గ పరిశీలకులు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చెరుకూరి సాయిరామ్ మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మీ ఆధ్వర్యంలో 11 క్లస్టర్లలో విజయవంతంగా మహానాడు సమావేశాలు నిర్వహిస్తున్నామని రేపు అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అనేక ప్రాంతాలలో జయంతి ఉత్సవాల అనంతరం తిరిగి ఉదయం 9 గంటలకు వర్చువల్ మహానాడు సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాలలో డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ, నియోజకవర్గ మాజీ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ఏఎంసీ చైర్ పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పితాని మోహన్, టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు మామిడిశెట్టి ప్రసాద్, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, పామర్తి వెంకటరామయ్య చెరుకుపల్లి సంతోష్ కుమార్, నాగిడి తాతాజీ, క్లస్టర్ కన్వీనర్స్ యరకరాజు గోపాలకృష్ణరాజు పంజా తాతయ్య నాయుడు, వీరవల్లి చంద్రశేఖర్, కడలి వాసు, పాల శ్రీరామదాసు, గాదిరాజు నారాయణరాజు, ఎద్దు ఏసుపాదం, నేదినూరి గంగాధర్ తిలక్, మైలబత్తుల ఐజాక్ బాబు, పాపోలు ఏడుకొండలు, ఎండి ఆలీషా షాభు,, మెంటే కాశీ విశ్వేశ్వరరావు పామర్తి వెంకటరామయ్య, పడమట సోమేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, ఉప్పులూరి చంద్రశేఖర్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ కొయ్యలగడ్డ గణపతి కోళ్ల సీతారాం మద్దుల రాము చల్లబోయిన గోవింద్ మాజీ కౌన్సిలర్లు చెల్లబోయిన వెంకట సుబ్బారావు బొక్క చంద్రమోహన్ గూడూరి రామకృష్ణ విజ్జురోతు రాఘవలు గొంతెన శ్రీనివాస్ వెలూరి సుబ్రహ్మణ్యశర్మ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ ఉపాధ్యక్షురాలు ఎస్డి.నసీమ బేగం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు టిడిపి నాయకులు ఇందుకురి సుబ్రహ్మణ్యరాజు గూడూరి సుబ్బారావు గంధం రాధా గుల్లంకి శ్రీలక్ష్మి ఎస్.కె రజియా బేగం అంబళ్ళ జోగేశ్వరి కొత్తపల్లి అప్పలరాజు మాస్టర్,టివిటి, వజ్జిపర్తి గురుమూర్తి తుమ్మిడి సుబ్బారావు అనపర్తి కృష్ణ ప్రసాద్ ములుగుర్తి శ్రీనివాస్ వీరమల్లు వెంకటరమణ బొక్క శ్రీనివాస్ పొట్రు రాంబాబు తలుపురి బాలయ్య సిరియాల నాగేశ్వరరావు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కో-కన్వీనర్లు టిడిపి కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.- – టిడిపి కార్యాలయం భీమవరం.
