సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో జేష్ఠమాసం నేపథ్యంలో పలు వార్డులలో స్థానిక సంఘాలు పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం 36వ వార్డులోని రామరాజు తోటలో మావుళ్ళమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి (చిన మావుళ్ళమ్మ) 41వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు నేడు, ఆదివారం ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మాట్లాడారు. ప్రతిఒక్కరూ అధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, ప్రతిఒక్కరూ భగవంతుని సేవా చేయాలని, అమ్మవారి గ్రామోత్సవాలు, జాతరలు ఆయా ప్రాంతాల ప్రజల శాంతిని కోరుకుంటాయన్నారు. గత ఇక్కడ 41 ఏళ్లుగా సేవ సమితి సభ్యులు సంప్రదాయ బద్ధంగా మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ.. ఈనెల 28వ తేదీ వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయని, 28న అన్న సమారాధన జరుగుతోందన్నారు. అనంతరం డప్పుల వాయిద్యాలు, గరగల నృత్యాలు, శక్తివేశాలతో అమ్మవారి జాతర కన్నుల పండుగగా నిర్వహించారు.
