సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని 4వ వార్డులో నేడు, శనివారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మున్సిపల్ అధికారులు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని, వీధిలైట్లు సక్రమంగా పనిచేయడం లేదని, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తదితర సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వెల్లడించిన ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి తీవ్రతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
