సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ట్రిపుల్ ఐటీల చరిత్రలో తొలిసారిగా ఏలూరు జిల్లా నూజివీడు లో (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ఐటీల్లో… ఈ ఏడాది నవంబరు వచ్చిన, 3 కౌన్సెలింగులు నిర్వహించినా ఇంకా 119 సీట్లు మిగిలిపోవడం నమ్మలేని నిజంగా మిగిలింది. తాజా సమాచారం ప్రకారం…ఎప్పుడు 2 జులైలో ఒకటి, రెండు కౌన్సెలింగుల్లోనే సీట్లన్నీ నిండిపోయే రాజీవ్ వైజ్ఞానిక,సాంకేతిక విశ్వ విద్యాలయ(ఆర్జీయూకేటీ) ట్రిపుల్ఐటీల్లో.. ఈ ఏడాది నవంబరు వచ్చిన, 3 కౌన్సెలింగులు నిర్వహించిన ఇంకా 119 సీట్లుమిగిలిపోయాయి.. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం , ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలున్నాయి. ఈ నాలుగింటికీ ఇప్పటికి సీట్లు భర్తీ కాకపోవడం విశేషం. ఈసారి అడ్మిషన్లకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలనూ పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో అవి రావడానికి ఆలస్యమైంది. దీనికితోడు సంబంధిత అధికారుల కమిటీ 1:1 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలవాలని నిర్ణయించింది. ఫలితంగా తీవ్రజాప్యం జరిగింది. ఆలస్యాన్ని గ్రహించిన విద్యార్థులు ప్రైవేటు కళాశాలలలొ చేరిపోయారు. అందుకే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టినా సీట్లు భర్తీ కాలేదు అని తెలుస్తుంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *