‘
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో ఇటీవల వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సామాన్య కుటుంబీకులకు వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 46,32,607/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను 67 మంది లబ్ధిదారులకు నేడు, గురువారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అందజేశారు. వైద్య ఖర్చులకు ఆర్ధికముగా స్తొమత లేని వారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ సహకరిస్తుందని అర్జీలు పెట్టుకోవచ్చునని వాటిని పరిశీలించి అర్హులకు అండగా ఉంటామని అన్నారు. లబ్దిదారులకు చెక్ లు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
