సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బంగారు చీర ప్రత్యేక కౌంటర్ ను నేడు, గురువారం ఉదయం 9.11 నిమిషాలకు ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, సత్యవాణి దంపతులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి , రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. నిలువెత్తు మూలవిరాట్ అమ్మవారికి బంగారు రూపం చేయడమే లక్ష్యమని, దాతలు భక్తుల సహకరం ఎంతో అవసరమని, అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి 100 కేజీల బంగారం అవసరమన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 కేజీల బంగారంతో వివిధ ఆభరణాలు చేయడం జరిగిందన్నారు. మరొక 23 కేజీలు బంగారం దేవస్థానం దగ్గర ఉందన్నారు. ఇంకా సుమారు 27 కేజీల బంగారం కావాల్సి ఉందని, త్వరలోనే దాతల సహకారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని అన్నారు. పలువురు బతికులు విరాళాలు అందించారు. స్వర్ణ నిది కమిటీ నిర్వాహకులు శ్యాం సిల్క్స్ అగర్వాల్ కు ఎమ్మెల్యే అంజిబాబు, సత్యవాణి దంపతుల మనవడు కార్తికేయ (హైదరాబాద్) చేతుల మీదుగా రూ 1,00,050 లు, కట్ట వెంకటేశ్వర రావు అనే భక్తుడు 56వేల రూపాయల విలువైన 4 గ్రాముల బంగారం, టి వెంకట కృష్ణ గుప్తా రూ 11, 116 లను,దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ 1,500/- లు స్వర్ణ వస్త్రానికి కానుకగా అందించారు. దాతలకు ఆశీర్వచనాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
