సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి పాలన చేతకాకపోవడంతో, సీఎంతో మంత్రులకు ఫ్రస్ట్రేషన్ అని చంద్రబాబు ఎద్దేవా చేసారు. జగన్ విమర్శిస్తున్నట్లు తనకేం ఫ్రస్ట్రేషన్ లేదని,.. మీకే నిద్రలేకుండా చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా రూ.2 వేల నోట్లు కనపడట్లేదని, ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టడం, ఢిల్లీ తరలించడం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల్ని కోర్టు బోన్లో నిలబెడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా?, హైకోర్టు ప్రభుత్వం ఫై చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రులు సమాధానం చెబుతారా? అని చంద్రబాబు వరుసగా ప్రశ్నించారు.
