సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో తెలంగాణ రాష్ట్రానికి చెం దిన లారీ డ్రైవర్ ఫై రవాణా అధికారులు దాష్టీకానికి పాల్పడిన ఘటన నిజమేనని నేడు, మంగళవారం రుజువు అయ్యింది. వివరాలలోకి వెళితే గత సోమవారం ఏలూరులో మహబూబ్ నగర్, మక్తల్ ప్రాంతానికి చెందిన బీ.రాజు లారీలో పత్తి లోడును తణుకుకు తీసుకెళ్తున్నాడు. లారీ ఏలూరు చేరుకోగా ఆశ్రం ఆసుపత్రికి సమీపం లో మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ ఈ.మృత్యుంజయ రాజు లారీని ఆపి లైసెన్స్, సరుకు పత్రాలు చూపాలని కోరారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతుల పత్రాలను చూపించారు. అయితే లంచాలకు రుచిమరిగిన ఇన్సెపెక్టర్ పత్రాలు సక్రమంగా ఉన్నా రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసారు. లంచం ఇవ్వలేనని డ్రైవర్ రాజు చెప్పడంతో ఆగ్రహించిన ఇన్సె పెక్టర్, అతని కారు డ్రైవర్, హోమ్ గార్డులు కల్సి లారీ డ్రైవర్ ను కొట్టారు. అంతేకాదు నీకు రూ. 20 వేలు జరిమానా విధిస్తున్నామని బెదిరించారు. ఈ ఘటన ను లారీ డ్రైవర్ తన మొబైల్ ఫోన్లో వీడియో తీస్తుండగా దానిని రవాణా అధికారులు లాక్కుని పగుల కొట్టారు. దీనితో డ్రైవర్ రాజు గత సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరుగుతున్న స్పం దనలో ఫిర్యా దు చేశారు. దీనిపై తక్షణమే స్పందిం చిన కలెక్టర్, రవాణా ఉన్న తాధికారులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన రవాణా శాఖ ఉన్న తాధికారులు మోటార్ వెహికల్ అధికారి మృత్యుం జయరాజు లారీ డ్రైవర్ ఫై దౌర్జన్యం చేయడం తోపాటు అతని నుంచి లంచం డిమాండ్ చేసినట్టుగా నిర్ధారించి దీనిపై ఇన్సెపెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీచేశామని జిల్లా ఇన్ఛార్జ్ ఉప రవాణా కమీషనర్ పురేంద్ర తెలిపారు. ఇన్సెపెక్టర్ కారును, అతని ఎన్ఫోర్స్ మెంట్ ఐడీని స్వాధీనం చేసుకున్నామని, రెండు రోజుల్లోషోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనలో ఇన్సె పెక్టర్ కారు డ్రైవర్ తో పాటు హోం గార్డుపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు.
