సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆధునిక డిజిటల్ రేవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్య క్రమాన్ని సీఎం జగన్ నేడు బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను, రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసర్వే చేపడుతున్నాం. గత 2 ఏళ్ళ నుండి 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లోభూములు సర్వే చేస్తున్నాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన జరిగాయి.7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం . ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లోసర్వే పూర్తిచేసి మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలుచ్చాము. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లోసర్వే పూర్తి అవుతుందన్నారు. రాజకీయమంటే జవాబుదారీతనం .. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాను చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నమ్ము కోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ము కున్నానని చెప్పారు. మీ ఇంటిలోమంచి జరిగిందా? లేదా? ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు (జగన్ కు ) అండగా ఉండండి అని సీఎం జగన్ ప్రజలను కోరారు.
