సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరిగిందని ఆరోపణలలో భాగంగా.. స్వామీజీలు టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కు ప్రయత్నించారని దర్యాప్తు జరుగుతున్నా కేసులో ఎవరు ఉహించనివిధంగా నరసాపురం ఎం పీ రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తాజా వార్త సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మె ల్యే ల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూర్చడంలో ఎం పీ రఘురామ పాత్ర ఉన్నదా? లేదా? అన్న అనుమానాల నివృత్తికి సిట్ విచారణకు ఆదేశించినట్లు వార్త సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *