సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు వారు గర్వించి అల్లూరి సీతారామరాజు, కొమరం బీమ్ పాత్రల ప్రేరణతో దర్శకదీరుడు రాజామౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల పైగా బాహుబలి 2 తరువాత తిరుగులేని సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు శాటర్న్ , సన్సెట్ సర్కిల్ వంటి అంతర్జాతీయ అవార్డులను సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఇప్పు డు మరో విశేష ఘనత సాధించింది. 1935 నుంచి సినీ పరిశ్రమలోఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తున్నా.. హాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు సొంతం చేసుకొంది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్నకు అభినందనలు చెబుతూ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *