సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భారత రాష్ట్ర పతి ద్రౌపతీ ముర్ము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకొన్నారు. ఆమె గౌరవార్ధం ఏర్పాటు చేసిన అభినందన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర పతి ద్రౌపతీ ముర్ము భారతీయ మహిళా శక్తికి ఒక ప్రతీక అని, ఒరిస్సాలో ఓ కుగ్రామంలో గిరిజన మహిళగా పుట్టి అక్కడ డిగ్రీ చదువు చదివిన ఏకైక మహిళగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలు అంచెలుగా ఎదిగి ఈ నాడు దేశానికీ ప్రధమ పౌరురాలు కావడం వెనుక ఆమె కృషి పట్టుదల మహిళా లందరు ఆదర్శంగా తీసుకోవాలని, పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ప్రేమకు భాష అడ్డం కి కాకూడదని.. అం దుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్య వాదాలు అంటూ ముర్ము తెలుగులో తెలిపారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందని విజయవాడ‘కనకదుర్గఅమ్మ వారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్య కళ ఇప్పు డు విశ్వవ్యా ప్తమైంది. దేశభాషలం దు తెలుగు లెస్స అని రాష్ట్రపతి అన్నా రు. కన్కా శుల్కం లాం టి గొప్ప నాటకాలకు ఏపీ చిరునామాగా నిలిచింది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఏపీ నుంచే వచ్చా రు. ఇప్పడు సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృ ద్ధి చెందుతోందని రాష్ట్రపతి ముర్ము సభకు కృతజ్ఞలు తెలిపారు.
